Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు... 15 d ago

8K News-17/03/2025 దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 475 పాయింట్ల లాభంతో 74,309, నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 22,551 లాభాల్లో ఉన్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 86.80 వద్ద కొనసాగుతోంది. ఇండస్ఇండ్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించిన సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం ఆ బ్యాంక్ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.